-ఇబ్బంది పడుతున్న వాహనచోదకులు - గోతులమయమైన రహదారి
పరవాడ, ఫిబ్రవరి 6: సింహాద్రి ఎన్టీపీసీకి చెందిన కారిడార్ రహదారి అధ్వానంగా ఉంది. సింహాద్రికి అవసరం నిమిత్తం ఏర్పాటు చేసుకున్న ఈ రహదారిలో ప్రైవేటు వాహనాలు అధిక లోడ్లతో రాకపోకలు సాగించడం కారణంగా రహదారి పూర్తిగా దెబ్బతింది. పెద్ద పెద్ద గోతులు పడడంతో పాటు రాళ్లు తేలి వుండడంతో అటుగా రాకపోక లు సాగించే వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరు నెలల కిందటే రహదారికి మరమ్మతులు చేపట్టారు. ఇంతలోనే రహ దారి ధ్వంసం కావడంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ముఖ్యంగా రాత్రుల సమయంలో రాకపోకలు సాగించే ద్విచక్ర వాహ నచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. గోతులను గుర్తించక పోవడంతో వాటిలో పడి గాయాలపాలవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. అలాగే భారీ వాహనాల రాకపోకలను అరికట్టాలని కోరుతున్నారు.
శిథిలావస్థలో పాఠశాల భవనం
పరవాడ, ఫిబ్ర వరి 6: భరణికం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. శ్లాబ్ పై నుంచి పెచ్చులూడి శిథిలమైన పాఠశాల భవనం పడుతున్నాయి. వర్షం వస్తే కారిపోతోంది. గోడలన్నీ బీటలు వారాయి. గచ్చులు కూడా ధ్వం సమయ్యాయి. దీంతో పాఠశాల భవనం ఎప్పుడు కూలిపోతుందో తె లియని పరిస్థితి నెలకొంది. శిథిల భవనం కారణంగా విద్యార్థులు అవస్థలు పడేవారు. దీంతో వారంతా మరో భవనంలో విద్యను అభ్యసి స్తున్నారు. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రస్తుతం అది నిరు పయోగంగా ఉంది. అధికారులు స్పందించి భవనానికి మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.